Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో… కీలక పాత్రలో..

|

Jul 10, 2021 | 7:29 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు..

Jr.NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో... కీలక పాత్రలో..
Jr Ntr
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్.. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ.. ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తిచేసే పనిలో ఉన్నాడట. ఆర్ఆర్ఆర్ పూర్తైన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు.. మరో యంగ్ హీరో కూడా నటించాల్సి ఉందట. కీలక పాత్ర కోసం టాలీవుడ్ లేదా కోలీవుడ్ యంగ్ హీరోను ఎంపిక చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే గతంలో ఎన్టీఆర్ పలువురు నటులతో స్క్రీన్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ పై కూడా అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. తాజాగా రాబోతున్న సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోను కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికి యంగ్ టైగర్ మరోసారి ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Also Read: Revenge: మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ తర్వాత అడ్డంగా బుక్కైన యువతి..

TSRTC Bus Pass: గ్రేట్‌వాసులకు అలర్ట్.. బస్సు పాస్ సేవలు నిలిపివేసిన టీఎస్‌ఆర్‌టీసీ.. తిరిగి ఎప్పుడంటే..?

SBI కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు ఆ సర్వీసులు బంద్.. హెచ్చరిస్తున్న బ్యాంక్..

Gold and Silver Price Today: దేశీయంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. పలు నగరాల్లో స్వల్పంగా పెరుగుదల..!