Animal 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ ఊచకోత.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..

ఇందులో రణబీర్ జోడిగా రష్మిక మందన్నా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటివరకు భారత దేశంలో రూ.66 కోట్లు రాబట్టింది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.80 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుండగా..

Animal 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే..
Animal 2nd day collections
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2023 | 3:17 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ రికార్డ్స్ సృష్టిస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ వంగా. ఇక ఇప్పటివరకు తన సినీ ప్రయాణంలో ఈసినిమాతో హయ్యేస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు రణబీర్ కపూర్. తెలుగులోనూ ఓ రేంజ్ వసూళ్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇందులో రణబీర్ జోడిగా రష్మిక మందన్నా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు రెండో రోజు సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటివరకు భారత దేశంలో రూ.66 కోట్లు రాబట్టింది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129.80 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుండగా.. అటు రణబీర్, అనిల్, రష్మిక, బాబీ నటనపై విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మూవీకి యూత్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. తండ్రి కొడుకుల అనుబంధం.. ఎమోషన్స్, లవ్ స్టోరీతోపాటు.. యాక్షన్, వయలెన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఓవైపు ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాల తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించాడు సందీప్. ఇప్పటివరకు రణబీర్ తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. కానీ ఈసారి యానిమల్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు.

కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం డైరెక్టర్ సందీప్ మాత్రమే. కేవలం సందీప్ తెరకెక్కించిన సినిమా కావడంతో యానిమల్ చిత్రానికి తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు పెంచాయి. ఇక విడుదల తర్వాత మరోసారి హిట్ అందుకున్నాడు సందీప్. రెండు రోజు దాదాపు 129 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు ఇంకా ఎక్కువే కలెక్షన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.