Anil Ravipudi: నోరు జారిన అనిల్.. సినిమాలో అసలు మ్యాటర్ చెప్పేశాడుగా..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మాస్ అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ . బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది .

Anil Ravipudi: నోరు జారిన అనిల్.. సినిమాలో అసలు మ్యాటర్ చెప్పేశాడుగా..
Anil Ravipudi

Updated on: Dec 31, 2025 | 8:06 AM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రాణిస్తున్న అనిల్ గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు నే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్.. పోస్టర్స్ , వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.

Year Ender 2025: ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, హిట్3 కాదు.. ఈ ఏడాది బిగెస్ట్ హిట్ సినిమా ఇదే

మీసాల పిల్ల సాంగ్ సుమారు 100 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. అలాగే తాజాగా వెంకటేష్, చిరంజీవి మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మన శంకర వరప్రసాద్ నుంచి వెంకటేష్, చిరంజీవి సాంగ్ విడుదల సందర్భంగా మీడియాతో అనిల్ మాట్లాడారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఓ లీక్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆ స్టార్ హీరో నన్ను బెదిరించే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ మీనా

నోరు జారిన అనిల్.. సినిమాలో వెంకీ ఎంత సేపు ఉంటాడు అనేది లీక్ చేశారు. అనిల్ రావిపూడి వెంకటేష్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్ లో వెంకటేష్ పాత్ర వస్తుందని తెలిపారు అనిల్ రావిపూడి. దాదాపు 25 నిమిషాల పాటు వెంకటేష్ సందడి చేయబోతున్నారని , ఇక వెంకటేష్ గారి పాత్ర గురించి ఇంతకుమించి తాను ఒక మాట కూడా చెప్పను అని అన్నారు అనిల్ రావిపూడి. మరింత చెప్తే థ్రిల్ పోతుందని అనిల్ అన్నారు. దాంతో అభిమానులకు, ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. ఇక జనవరి 12వ మన శంకర వరప్రసాద్ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

అందుకే ఇన్ స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేస్తా.. ఓపెన్‌గా చెప్పేసిన ఇనయ సుల్తానా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.