అందాల అనూని అందుకోగలవా సమీరమా..?

| Edited By:

Dec 23, 2019 | 3:36 PM

జబర్దస్త్ షో అంటేనే లెక్కకు మించిన నవ్వులతో పాటు అనసూయ అందాలు కూడా. మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌ చేసే అను కోసం కూడా రిమోట్‌ సదరు ప్రొగ్రామ్ వచ్చే ఛానల్ వైపు పరిగెత్తుతుందన్న మాట వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ తెరపై యాంకరింగ్‌కి గ్లామర్‌ని యాడ్ చేసింది అనసూయ. అంతకముందు చాలామంది బుల్లితెరని ఏలినా, ఇప్పుడు ఏలుతున్నా.. వారందరూ షోలకి స్పైస్ యాడ్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు జబర్దస్త్‌ను డామినేట్ చెయ్యడానికి అదిరింది పేరుతో […]

అందాల అనూని అందుకోగలవా సమీరమా..?
Follow us on

జబర్దస్త్ షో అంటేనే లెక్కకు మించిన నవ్వులతో పాటు అనసూయ అందాలు కూడా. మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్‌ చేసే అను కోసం కూడా రిమోట్‌ సదరు ప్రొగ్రామ్ వచ్చే ఛానల్ వైపు పరిగెత్తుతుందన్న మాట వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు టెలివిజన్ తెరపై యాంకరింగ్‌కి గ్లామర్‌ని యాడ్ చేసింది అనసూయ. అంతకముందు చాలామంది బుల్లితెరని ఏలినా, ఇప్పుడు ఏలుతున్నా.. వారందరూ షోలకి స్పైస్ యాడ్ చెయ్యలేదు.

అయితే ఇప్పుడు జబర్దస్త్‌ను డామినేట్ చెయ్యడానికి అదిరింది పేరుతో జీ తెలుగు కొత్త  కామెడీ ప్రొగ్రామ్‌ను స్టార్ట్ చేసింది. జబర్ధస్త్ జడ్జ్ నాగబాబుతో పాటు కొందరు టీం లీడర్లు కూడా అక్కడినుంచి దుకాణం సర్ది.. ఇక్కడ వాలిపోయారు. వీరి వల్ల ఆడియెన్స్ ఆటెన్షన్ గ్రాబ్ అయ్యింది. అయితే షోకి కావాల్సిన గ్లామర్ ఎలా..?. ఇక్కడే సీన్‌లోకి వచ్చింది బుట్టబొమ్మ సమీర. ఆమె ఫేస్ ఇంతకుముందు బుల్లితెరపై చూసిందే అయినా, అదిరింది షోలో ప్రెష్‌గా కనిపించింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, స్పాట్ పంచులతో, ముద్దు ముద్దు నవ్వులతో బాగానే ఎంటర్టైన్ చేస్తోంది.

ఏది ఏమైనా అనసూయ ఇప్పుడు మూవీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. సమీరా తాజాగా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంకొంచెం ఎఫెక్టీవ్ గ్లామర్‌తో అదరగొడితే అనసూయను రీప్లేస్ చెయ్యకపోయినా, అనసూయ రేంజ్‌కు వెళ్లగలదేమో.. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.