Anchor Ravi And Lasya: ఐదేళ్ల తర్వాత కలిసిన ఆ ఇద్దరు… బుల్లితెరపై మళ్లీ సందడి చేయబోతున్నారా..?
స్టార్ మాలో వచ్చిన 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ రవి - లాస్య. కానీ...

స్టార్ మాలో వచ్చిన ‘సమ్‌థింగ్ స్పెషల్’ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ రవి – లాస్య. కానీ, ఈ జోడీ కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అయితే బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నా రవి-లాస్య జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. టీఆర్పీ రేటింగ్‌లోనూ వీరిద్దరి కాంబో హిట్ పెయిర్‌గా నిలిచింది. రవి-లాస్య జోడీకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారంటే వీరిద్దరి కాంబినేషన్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటిదాకా టామ్ అండ్ జెర్రీలా కలిసున్న వీరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. పెళ్లి తర్వాత బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చిన లాస్య తాజాగా బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
కాగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్యూట్ పెయిర్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఈ విషయన్ని స్వయంగా యాంకర్ రవి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి స్పెషల్ వేడుకగా వీరిద్దరితో ‘స్టార్‌మా’ వాళ్లు ఓ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఈవెంట్‌తో రవి-లాస్య కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
Also Read: Bigg Boss Telugu : భారీ రేటింగ్‌తో దూసుకుపోయిన బిగ్ బాస్ షో.. నాలుగో సీజన్ టీఆర్ఫీ ఎంతంటే..