AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Grapes Vs Black Grapes: నల్ల ద్రాక్ష వర్సెస్ పచ్చ ద్రాక్ష.. ఏది ఆరోగ్యానికి మంచిది..?

ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పండు. నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్లు అధికంగా ఉండగా ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ K, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ద్రాక్షను రోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Green Grapes Vs Black Grapes: నల్ల ద్రాక్ష వర్సెస్ పచ్చ ద్రాక్ష.. ఏది ఆరోగ్యానికి మంచిది..?
Green Grapes Vs Black Grapes
Prashanthi V
|

Updated on: Mar 18, 2025 | 1:27 PM

Share

ద్రాక్ష తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ K, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ రుచికరంగా ఉండే ఆరోగ్యానికి మంచి పండ్లు. మనం కొనే పండ్లలో ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి తినడానికి సులభంగా ఉండి రుచి కమ్మగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో నాలుగు నుంచి ఐదు రోజులు నిల్వ ఉంచగలిగే ఈ పండ్లు ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. కానీ పచ్చ ద్రాక్ష లేదా నల్ల ద్రాక్ష ఏది తినడం మంచిదో అనేది చాలా మందికి సందేహంగా ఉంటుంది.

ధరలో తేడా

సాధారణంగా పచ్చ ద్రాక్ష చౌకగా ఉంటుంది. కానీ నల్ల ద్రాక్ష కొంచెం ఖరీదైనది. అందువల్ల చాలా మంది తరచుగా పచ్చ ద్రాక్షనే కొనుగోలు చేస్తారు. అయితే ధర ఎక్కువగా ఉండటం వల్ల నల్ల ద్రాక్ష మేలంటూ అనుకోవాల్సిన అవసరం లేదు.

రుచిలో తేడా

నల్ల ద్రాక్ష తీపి, రుచికరంగా ఉంటుంది. రంగు ఆకర్షణీయంగా ఉండటంతో చాలా మంది ఇష్టపడతారు. మరొకవైపు పచ్చ ద్రాక్ష క్రంచీగా ఉండి పుల్లని రుచిని ఇస్తుంది.

పోషకాలు

నల్ల ద్రాక్ష ఎక్కువగా రెడ్ వైన్ తయారీలో, ఆకుపచ్చ ద్రాక్ష వైట్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు. పోషకాల పరంగా రెండు రకాల ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ K, పొటాషియం ఎక్కువగా ఉన్నాయి.

మొత్తం మీద ఏ ద్రాక్ష తినాలన్నది మీ రుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి నల్ల ద్రాక్ష ఇష్టం, మరికొందరికి పచ్చ ద్రాక్ష ఇష్టం. రెండు రకాలూ తింటే ఆరోగ్యానికి మేలు. క్యాన్సర్‌ను నిరోధించడంలో, గుండె జబ్బులను తగ్గించడంలో ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ద్రాక్షలోని పోషకాలు కండరాలకు ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనానికి ద్రాక్షను తరచూ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

Follow Us
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..