
బుల్లితెరకు అందాలు అద్దిన భామ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనసూయ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ ఆతర్వాత యాంకర్ గా మరి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో అనసూయ క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి అలరించింది. ఇక రంగస్థలం సినిమా అనసూయ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అనసూయ. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది అనసూయ. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన పై వచ్చే ట్రోల్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది అనసూయ.
తాజాగా అనసూయ పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అనసూయ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచీ తన తల్లి శుక్రవారాలు, ఇతర రోజుల్లో ఉల్లిపాయ తినకుండా చేయడంతో తాను దేవాలయాలకు వెళ్లడం అలవాటైందని తెలిపింది అనసూయ. చిన్నతనంలో ఎక్కువగా సంతోషిమాత దేవాలయం, సాయిబాబా దేవాలయాలను సందర్శించేదాన్నని చెప్పుకొచ్చింది. ఇక తన భర్తను పెళ్లి చేసుకోవడానికి సాయిబాబాకు ప్రత్యేకంగా మొక్కుకున్నానని తెలిపింది.
భర్తతో పెళ్లి అవ్వడం కోసం ఏడేళ్ల పాటు చాక్లెట్, ఆలుగడ్డలు తినడం మానేశానని తెలిపింది. అంతేకాకుండా, 11 గురువారాలు ఉపవాసం ఉండి, తన వివాహానికి అందరూ అంగీకరించాలని బాబాను ప్రార్థించినట్లు తెలిపింది. అలాగే తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. తన భర్తతో ఎన్‌సీసీ క్యాంపులో పరిచయమైందని, తనే తన జీవితంలో ఉన్న ఏకైక వ్యక్తి అని అనసూయ స్పష్టం చేసింది. తన భర్తే తనకు మొదట ప్రపోజ్ చేశాడని తెలిపింది. తమ ప్రేమకథలో ఎంతో మసాలా ఉందని, బయోపిక్ తీసే అంత కథ ఉందని నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయితే, వారి పెళ్లికి కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, దాని కారణంగా తనను ఇంట్లో నుంచి బయటకు పంపించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో హాస్టల్‌లో ఉన్నానని, ఆతర్వాత ఒక చిన్న పెంట్‌హౌస్‌లో, రెండు గదులలో ఒంటరిగా నివసించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తన చెల్లి, అప్పుడప్పుడు తల్లి వచ్చి ఉండేవారని, తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని తెలిపింది. భవిష్యత్తులో కూతురిని కనాలని కోరిక ఉందని కూడా చెప్పుకొచ్చింది అనసూయ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.