
అనసూయ భరద్వాజ్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. జబర్దస్త్ లో తన అందంతో, డాన్స్ లతో, చలాకీ మాటలతో ప్రేక్షకులను కవ్వించింది అనసూయ ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. రెగ్యులర్ గా తన సినిమా సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను, ఫోటోలను కూడా పంచుకుంటుంది. అలాగే తనపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసేవారి పై కూడా ఫైర్ అవుతుంటుంది అనసూయ.
ఇదిలా ఉంటే అనసూయ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కెరీర్ బిగినింగ్ లో నేను వీఎఫ్ఎక్స్ కంపెనీలో పని చేశా.. అక్కడ నేను ఎంతో కష్టపడ్డా.. ఆ కంపెనీలో వెట్టి చాకిరీ చేశానని అక్కడ పని చేస్తున్న సమయంలోనే నాకు సుకుమార్, మెహర్ రమేశ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో పరిచయం ఏర్పడింది. ఆ కంపెనీ ఎన్టీఆర్ గారి కంత్రి సినిమాలో యానిమేటెడ్ వర్షన్ చేసింది అని చెప్పుకొచ్చింది. ఇక అనసూయ కీలక పాత్రల్లో నటిస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పిస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీర మల్లు సినిమాలో కనిపించారు అనసూయ. ఈ క్రమంలోనే అనసూయ గురించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి