AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తైక్వాండాలో బ్లాక్ బెల్ట్.. సాయి పల్లవిలా మేకప్ లేకుండా నటించే హీరోయిన్.. ఎవరో తెలుసా?

సాధారణంగా నటులు అన్నాక మేకప్ వేసుకోవడం సహజం. స్క్రీన్ పై అందంగా కనిపించాలంటే ఎంతో కొంత ముఖానికి రంగులేసుకోవాల్సిందే. అయితే సాయి పల్లవి లాంటి కొందరు హీరోయిన్లు మాత్రమే ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ గా నటిస్తారు. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: తైక్వాండాలో బ్లాక్ బెల్ట్.. సాయి పల్లవిలా మేకప్ లేకుండా నటించే హీరోయిన్.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 24, 2025 | 6:32 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? బాక్సింగ్ డ్రెస్ లో చూసి ఠక్కున అబ్బాయి అనుకునేరు. ఆ అమ్మాయి ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా న్యాచురల్ యాక్టింగ్ తో దూసుకెళ్లిపోతోంది. సాయి పల్లవిలా మేకప్ లేకుండా నటిస్తూనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. అలా తాజాగా ఈ అమ్మడు నటించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు థియేటర్లు, ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ ట్రెండింగ్ అవుతోంది. కేరళకు చెందిన ఈ అందాల తార మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. అదే సమయంలో చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న డీఎన్ఏ (తెలుగులో ఓమై బేబీ) మూవీ హీరోయిన్ నిమిషా సజయన్.

జులై 18 థియేటర్లలో రిలీజైన ఓ మై బేబీ సినిమా ఒక్క రోజు గ్యాప్ లో అంటే జులై 19న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హీరోగా అధర్వ నటిస్తే, అతని భార్య పాత్రలో నిమిషా సజయన్ అద్భుతంగా నటించింది. దీంతో మరోసారి ఈ ముద్దుగుమ్మ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

డీఎన్ ఏ సినిమాలో నిమిషా సజయన్..

తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది నిమిషా సజయన్. ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, చిన్నా (తెలుగులో చిన్నా), జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి సినిమాలతో పాటు పోచర్, డబ్బా కార్టెల్ తదితర వెబ్ సిరీసులతోనూ ఆడియెన్స్ ను మెప్పించింది. నిజ జీవితంలో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిషా రీల్ లైఫ్ లోనూ మేకప్ వేసుకోనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

చీరలో మెరిసిపోతోన్న నిమిషా సజయన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు