Anasuya: ఉప్పల్ స్టేడియంను ఊపేసిన అనసూయ.. అమ్మడి రియాక్షన్ అదుర్స్ అంటున్న నెటిజన్స్

గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ప్రతి బాల్ మ్యాచ్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది. బాల్ బాల్ కు మ్యాచ్ టర్న్ అవుతూ వచ్చింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలి వచ్చారు.

Anasuya: ఉప్పల్ స్టేడియంను ఊపేసిన అనసూయ.. అమ్మడి రియాక్షన్ అదుర్స్ అంటున్న నెటిజన్స్
Anasuya

Updated on: May 03, 2024 | 5:43 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి. ఏ టీమ్ గెలుస్తుందా..? అని క్రికెట్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఐపీఎల్ కప్ ఎవరు విన్ అవుతారు.? అన్నది ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ లకు సినీ సెలబ్రెటీలకు కూడా ఈ మ్యాచ్ లకు హాజరవుతూ.. ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నారు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ప్రతి బాల్ మ్యాచ్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది. బాల్ బాల్ కు మ్యాచ్ టర్న్ అవుతూ వచ్చింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ భారీగా తరలి వచ్చారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రెటీలు కూడా చాలా మంది హాజరయ్యే తమ అభిమాన జట్టుకు మద్దతు తెలిపారు. అలాగే తెలుగు యాంకర్స్ కూడా గురువారం ఉప్పల్ స్టేడియం లో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అలాగే యాంకర్ కామ్ యాక్టర్ అనసూయ కూడా గురువారం ఉప్పల్ స్టేడియం లో సందడి చేశారు. హైదరాబాద్ టీమ్ ను సపోర్ట్ చేస్తూ అనసూయ సందడి చేసింది. అనసూయ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనసూయ ఓ సందర్భంలో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అనసూయ రియాక్షన్ చూసిన అభిమానులు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ ను వీక్షిస్తూ.. బౌండరీలు, సిక్స్ లో బాసినప్పుడు ఎగిరి గంతులేసింది అనసూయ. అలాగే వికెట్స్ పడ్డప్పుడు అయ్యో అంటూ బాధపడింది. ఇక జయదేవ్ ఉనాద్కత్ వేసిన 15వ ఓవర్‌లో రియాన్ పరాగ్ భారీ షాట్ ఆడాడు. బాల్ గాలిలోకి లేవడంతో లాంగాన్‌లో అబ్దుల్ సమద్ క్యాచ్‌కు పట్టేందుకు పరాయత్నించాడు. కానీ అది మిస్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ అంతా అయ్యో అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అనసూయ కూడా దీని రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అనసూయ రియాక్షన్..

అనసూయ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.