టాలీవుడ్ కు కొత్త అందాలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలా మంది భామలు మనదగ్గర సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అక్కడ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న బ్యూటీస్ కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్ లాంటి బ్యూటీస్ తెలుగు ఆఫర్స్ అందుకుంటున్నారు. త్వరలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాతో దీపికా పదుకొనె కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఇప్పుడు వీరితో పటు మరో ముద్దుగుమ్మ కూడా తెలుగు ప్రేక్షకులను మరికొద్దిరోజుల్లో పలకరించనుంది. ఆ అమ్మడు ఎవరో కాదు వయ్యారి భామ అనన్య పాండే(Ananya Pandey). బాలీవుడ్ భామ అనన్య త్వరలోనే లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో పర్యటించిన లైగర్ టీమ్ ఇటీవల హైదరాబాద్ లో కూడా సందడి చేశారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. బన్నీ అంటే చాలా ఇష్టమని ఆయనతో కలిసి నటించడానికి ఆతృతగా ఉన్నానని తెలిపింది అనన్య. ఇక తెలుగు ప్రేక్షకుల లవ్ చాలా బాగుంది అని.. ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చింది. లైగర్ తర్వాత అనన్య కు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడతాయేమో చూడాలి. అదృష్టం బాగుంటే అల్లు అర్జున్ పిలిచి మరి ఛాన్స్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. మరి ఈ లేడీ లైగర్ కు ఆ ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..