యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే ఒకటి. ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుంది. అలాగే కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ – స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వనీత్ దత్ దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే శుక్రవారం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తన ట్వి్ట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సాంకేతిక సాయం కావాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రను కోరారు. ‘డియర్ ఆనంద్‌మహీంద్ర సార్ మేము అమితాబ్ బచన్, ప్రభాస్ మరియు దీపికలతో కలిసి ప్రాజెక్ట్ కే అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి మించి అధునాతన టెక్నాలజీతో ఈ సినిమాకోసం వాహనాలను రూపొందిస్తున్నాం. ఒకవేళ మా కల నిజమైతే అది మన దేశానికి గర్వకారణం అని భావించాలి. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం.. అందుకోసం మీ సాయం కావలి. ఇంజనీర్ల విషయంలో మాకు మీ సాయంకావాలి. మీ దగ్గర టాలెంటెడ్, ఇండియన్ టీమ్ ఇంజనీర్లు , డిజైనర్లు ఉన్నారు..వారి సాయం మాకు అవసరం. ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు… భవిష్యత్తును రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే సంతోషిస్తాను’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.
నాగ్ అశ్విన్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ఇంత అధ్భుతమైన అవకాశాన్ని ఎలా రిజెక్ట్ చేస్తాం నాగ్ అశ్విన్.. మా గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్ మెంట్ చీఫ్ వేలు మహీంద్ర మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తారు. తమ ఇప్పటికే అధునాతన హంగులతో ఎక్స్ యూవీ 700 కారును రూపొందించారు అంటూ మహీంద్ర ట్వీట్ చేశారు. దీనికి నాగ్ అశ్విన్ సంతోషంగా తిరిగి రిప్లై ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
How could we refuse an opportunity to help you envision the future of mobility @nagashwin7 ? Our Chief of Global Product Development @Velu_Mahindra will, I’m sure, happily throw his weight behind you. Velu developed the @xuv700 & already has his feet in the future! https://t.co/4DDuOULWZD
— anand mahindra (@anandmahindra) March 4, 2022