Shah Rukh Khan: కింగ్ ఖాన్‌ను చుట్టుముట్టిన లేడీ ఫ్యాన్స్.. వాళ్ళు చేసిన పనికి షాక్ అయిన షారుఖ్

|

Sep 20, 2023 | 12:55 PM

గతకొంతకాలంగా షారుఖ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ పఠాన్, జవాన్ సినిమాలుభారీ విజయాలను సాధించి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. అయితే షారుఖ్ ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడుతూ ఉంటారు. షారుఖ్ ఇంటిదగ్గర కూడా వందలాది మంది అభిమానులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక షారుక్ కూడా తన అభిమానులతో ఎంతో ప్రేమగా మెలుగుతాడు. చాలా మంది హీరో హీరోయిన్స్ అభిమానుల దగ్గర దురుసు తనం చూపిస్తారు కానీ షారుఖ్ ఖాన్ అలా కాదు .. చాలా ఓపికగా అభిమానులను పలకరిస్తూ.. వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు.

Shah Rukh Khan: కింగ్ ఖాన్‌ను చుట్టుముట్టిన లేడీ ఫ్యాన్స్.. వాళ్ళు చేసిన పనికి షాక్ అయిన షారుఖ్
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్  షారుఖ్‌ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలివస్తారు. గతకొంతకాలంగా షారుఖ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ పఠాన్, జవాన్ సినిమాలుభారీ విజయాలను సాధించి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. అయితే షారుఖ్ ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడుతూ ఉంటారు. షారుఖ్ ఇంటిదగ్గర కూడా వందలాది మంది అభిమానులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక షారుక్ కూడా తన అభిమానులతో ఎంతో ప్రేమగా మెలుగుతాడు. చాలా మంది హీరో హీరోయిన్స్ అభిమానుల దగ్గర దురుసు తనం చూపిస్తారు కానీ షారుఖ్ ఖాన్ అలా కాదు .. చాలా ఓపికగా అభిమానులను పలకరిస్తూ.. వారితో ఫోటోలు దిగుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అభిమానులు ఎంత చిరాకు తెప్పించినా షారుఖ్ ఎంత సహనంతో ఉంటాడో ఈ వీడియో చూస్తే అర్ధవుతుంది. షారుఖ్ ఖాన్ పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. షారుఖ్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో షారుఖ్చు ఖాన్ ను చుట్టుముట్టి ఆయనను ముద్దులు పెట్టుకున్న సన్నివేశం చూడొచ్చు . అమ్మాయిలే ఉండి ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ చాలా అరుదుగా సహనం కోల్పోతాడు. చాలా సార్లు కూల్ గా ప్రవర్తిస్తారు. అభిమానులు చిరాకు తెప్పించినా.. హద్దులు దాటి ప్రవర్తించడు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియో ఇందుకు నిదర్శనం. ఇందులో షారుఖ్‌ పై లేడీ ఫ్యాన్స్  ఒక్కసారిగా చుట్టుముట్టి అతడిని కొగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ రచ్చరచ్చ చేశారు. అదే ఓ హీరోయిన్ ని ఇలా అబ్బాయిలు చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’ సినిమాతో సాలిడ్ సక్సెస్‌ అందుకున్నాడు. సౌత్ సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షారూఖ్‌తో సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి నటించగా.. సన్యా మల్హోత్రా, ప్రియమణి, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 883 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది.

SRK molested by ladies
byu/DreamBeliveActAchive inBollyBlindsNGossip

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.