Amala Akkineni: తెలంగాణ‌ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను తెలిపే డాక్యుమెంట‌రీ `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` : అమల అక్కినేని

|

Mar 23, 2022 | 8:27 AM

పేర్ని నృత్య రూప‌క‌ర్త డా. న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జ‌యంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నివహించారు. సోమ‌వారం 30 నిముషాల నిడివిగ‌ల‌ డాక్యెమెంట‌రీని ప‌లువురుకి ప్ర‌ద‌ర్శించారు.

Amala Akkineni: తెలంగాణ‌ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను తెలిపే డాక్యుమెంట‌రీ `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` : అమల అక్కినేని
Amala Akkineni
Follow us on

Stories of Telangana: పేర్ని నృత్య రూప‌క‌ర్త డా. న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జ‌యంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నివహించారు. సోమ‌వారం 30 నిముషాల నిడివిగ‌ల‌ డాక్యెమెంట‌రీని ప‌లువురుకి ప్ర‌ద‌ర్శించారు. ఇది కాన్సెప్ట్ క్రియేట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ డి. స‌మీర్ కుమార్ ఆధ్వ‌ర్యంలో రూపొందింది. సుప్రియ యార్ల‌గ‌డ్డ దీనిని నిర్మించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియో మినీ థియేట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అమ‌ల అక్కినేని(Amala Akkineni)హాజ‌ర‌య్యారు. తెలంగాణ‌కు సంబంధించిన సంస్కృతి సంప్ర‌దాయాల‌ను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` డాక్యుమెంట‌రీ ద్వారా చూపించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా అమ‌ల అక్కినేని మాట్లాడుతూ.. మ‌న‌లోని అంత‌ర్‌శ‌క్తికి డాన్స్ అనే ప్రక్రియ చ‌క్క‌టి ఫ్లాట్‌ఫామ్ లాంటిది అని అన్నారు. క‌ళ అనేది బ‌తికున్నంత‌కాలం డాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి చెప్పిన‌ట్లు, డాన్స్ అనేది యోగ లాంటిది. మ‌న‌లోని సామ‌ర్థ్యం, శ‌క్తిని వెలికితీయ‌డ‌మేకాకుండా.. జీవితంలో ఉన్న‌తంగా ఎలా వుండాల‌నేది తెలియ‌జేస్తుంది. చాలామంది కంప్యూట‌ర్ ముందు కూర్చున్న‌వారు కానీ ఇతరులు కానీ ప్ర‌స్తుతం ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి వారు డాన్స్ చేస్తే అద్భుతంగా యోగ చేసిన‌ట్లుగా వుంటుంది. నా వ‌య‌స్సువారు చేయ‌లేక‌పోయినా యువ‌త ఇది అల‌వ‌ర్చుకోవాలి. డాన్స్ పై డాక్యుమెంట‌రీ చేయ‌డం, అందులోనూ అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం చాలా గొప్ప‌విష‌యం. మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ తెలియ‌జేసేలా స‌మీర్ చేసిన ప్ర‌యోగం అభినంద‌నీయం. ఇంత‌కుముందు స‌మీర్ `మోక్ష‌` అనే షార్ట్ ఫిలిం చేశాడు. డాన్స్‌, సినిమా అనేవి ఒక‌దానికి ఒక‌టి స‌మ‌న్వ‌యం అయివుంటాయి. నేను క‌ళాక్షేత్రంలో గ్రాడ్యుయేట్ చేస్తుండ‌గా, చాలా మంది సినిమావైపు మొగ్గారు. నేను డాన్స్‌ను సెల‌క్ట్ చేసుకున్నాన‌ని తెలిపారు అమల. అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన స‌మీర్‌, ధృవ‌, హ‌లో, అల వైకుంఠ‌పురం వంటి ప‌లు సినిమాల‌కు ప‌నిచేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..