
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పుష్ప 2 సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ.. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ పట్టాలెక్కింది. ఇదెలా ఉంటే.. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తుంటారు బన్నీ. మాస్ హీరోగా .. స్టైలీష్ స్టార్ గా ఎప్పుడూ తన స్వాగ్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా బన్నీ ధరించిన లగ్జరీ స్టైలీష్ వాచ్ ధర తెలిసి అందరూ షాకవుతున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..
ఇటీవల అల్లు అర్జున్ కేవలం రూ. 5,295 రెట్రో-స్టైల్ వాచ్ ధరించి కనిపించారు. లగ్జరీగా కనిపించిన ఆ వాచ్ ధర తెలిసి ఇప్పుడు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. బన్నీ ఇటీవల కాసియో వింటేజ్ REF A700WG-9A వాచ్ ధరించి కనిపించారు. ఈ వాచ్ ఒకప్పట వింటేజ్ లుక్ అందిస్తుంది. వాచ్ బంగారు రంగు స్టెయిన్‌లెస్-స్టీల్ పట్టీ, దీర్ఘచతురస్రాకార డయల్‌తోపాటు.. వింటేజ్ సిల్హౌట్, తేలికైనా రెపిన్ కేసు ఈ వాచ్ లుక్ ను ఎలివేట్ చేస్తుంటాయి. ఈ స్టాప్ వాచ్ రోజూవారీ అలారం, గంటకు చైమ్, LEd ఇల్యూమినేషన్, ఆటో క్యాలెండర్ చూపిస్తుంది. అలాగే ఈ వాచ్ వాటర్ ఫ్రూవ్ కూడా. ప్రస్తుతం ఈ వాచ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..
ఈమధ్యకాలంలో కాసినో వాచ్ ట్రెండ్ తెగ నడుస్తుంది. వింటేజ్ లుక్ లో అద్భుతంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక డిజైనర్ షర్ట్ కంటే తక్కువ ఖరీదు చేసే వాచ్ ధరించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..