Allu Arjun: జీవితంలో అందమైన క్షణం అదే.. పూరి జగన్నాథ్‏కు అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.. ఎందుకంటే..

|

Jan 12, 2024 | 6:14 PM

ఈ సినిమాలో పక్కా ఊరమాస్ గెటప్ లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ. ఇందులో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు.. తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఉన్నట్లుండి పూరికి బన్నీ ఎందుకు థాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా ?..

Allu Arjun: జీవితంలో అందమైన క్షణం అదే.. పూరి జగన్నాథ్‏కు అల్లు అర్జున్ స్పెషల్ థాంక్స్.. ఎందుకంటే..
Allu Arjun, Puri Jagannadh
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పక్కా ఊరమాస్ గెటప్ లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ. ఇందులో తన నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు.. తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఉన్నట్లుండి పూరికి బన్నీ ఎందుకు థాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా ?.. అందుకు పెద్ద కారణమే ఉంది. అదెంటో చూద్దాం. ఇప్పటివరకు బన్నీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో దేశముదురు ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హాన్సిక కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలైన నేటికి 17 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. తనకు హిట్ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే దేశముదురు సినిమా విజయం తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశాడు బన్నీ.

“దేశముదురు సినిమా ఈరోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇది అందమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్ లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు” అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో 2013లో ఇద్దరమ్మాయిలతో సినిమా వచ్చింది. ఇదిలా ఉంటే.. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. అలాగే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.