Pushpa 2: సంధ్యా థియేటర్‌ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. రేవతి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు..

|

Dec 06, 2024 | 9:59 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ లో భాగంగా అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం (డిసెంబర్ 04) రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దురదృష్టవశాత్తూ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Pushpa 2: సంధ్యా థియేటర్‌ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్.. రేవతి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు..
Allu Arjun
Follow us on

అల్లు అర్జున నటించిన పుష్ప-2 గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే అంతకు ముందు రోజే అంటే బుధవారం (డిసెంబర్ 04) బెనిఫిట్ షోస్ పడ్డాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ లోనూ పుష్ప 2 ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. సాధారణంగానే ఈ థియేటర్‌ కు సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియడంతో సంధ్యా థియేటర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఝులిపించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇదే క్రమంలో తొక్కిసలాట జరగడంతో పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కాగా రేవతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రేవతి మృతిపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలి అని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తా. అలాగే మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్నిస్వయంగా కలుస్తాను’ అని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.