AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: తగ్గేదే లే.. రికార్డ్ సెట్ చేసిన పుష్పరాజ్.. ఆ విషయంలో అల్లు అర్జున్ ఫస్ట్..

పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

Pushpa: తగ్గేదే లే.. రికార్డ్ సెట్ చేసిన పుష్పరాజ్.. ఆ విషయంలో అల్లు అర్జున్ ఫస్ట్..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2022 | 1:01 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa) బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ సౌత్, నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో పుష్పరాజ్ పాత్రకు.. ఆటిట్యూడ్‏కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది పుష్ప. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి.

పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఊఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఏం చెప్పాలి..? పుష్ప సినిమాలోని ప్రతీ విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది.

ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. పుష్ప అదే కంటిన్యూ చేసింది. పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఐకాన్ అల్లు అర్జున్. అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైపోతుందిప్పుడు. ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. దర్శకుడు సుకుమార్‌ను పొగుడుతూ.. పుష్ప సినిమాను ఆయన వర్ణించిన తీరు అద్భుతం. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ను ఆకాశానికి ఎత్తేసారు రాజ్ కుమార్ హిరాణి.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేసారు. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు.

Follow Us