Pushpa 2: ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఈ శుక్రవారమే థియేటర్లలోకి పుష్ఫ.. అడ్వాన్స్ బుకింగ్ కూడా..

|

Nov 20, 2024 | 2:04 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటేడ్ సినిమా పుష్ఫ 2 : ది రూల్. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుకుమార్ రెండో పార్ట్ ను తెరకెక్కించాడు.

Pushpa 2: ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఈ శుక్రవారమే థియేటర్లలోకి పుష్ఫ.. అడ్వాన్స్ బుకింగ్ కూడా..
రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా నాన్‌ బాహుబలి రికార్డ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. నాన్‌ బాహుబలి ఎందుకు? అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలిని, ఆ మధ్య విడుదలైన ట్రిపుల్‌ ఆర్‌నీ కూడా గేమ్‌లోకి తీసుకొచ్చేయండి..
Follow us on

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ఫ 2 ది రూల్ సినిమా రిలీజ్ కు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ కాగా.. పుష్ప రాజ్ దెబ్బకు యూట్యూబ్‌ షేక్ అవుతోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు రాలేనన్నీ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న పుష్ఫ 2 సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలను దాటి అమెరికాలో అత్యంత వేగంగా ఒక మిలియన్ వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. కాగా పుష్ప 2 రిలీజ్ కు కేవంల రెండు వారాలే ఉంది. అయితే అంతకు ముందే పుష్ఫరాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. అవును పుష్ప ది రైజ్- పార్ట్ 1 హిందీ వెర్షన్ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ నెల 22న థియేటర్లలో పుష్ప పార్ట్ 1 సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు గోల్డ్‌ మైన్స్‌ టెలీ ఫిల్మ్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. నార్త్ లో పుష్ఫ 2 వసూళ్లను మరింత పెంచుకునే ఆలోచనతోనే మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే యూఎస్‌లో పుష్ప పార్ట్‌-1 రీ రిలీజ్‌ బుకింగ్స్ ‍ప్రారంభించనున్నట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇతర దక్షిణాది భాషల్లోనూ పుష్ప రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు

ఇటీవల బిహార్‌ రాజధాని పాట్నా వేదికగా ‘పుష్ప 2’ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఏకకాలంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఇండియాతో పాటు అమెరికా, యూఏఈ, రష్యా, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఏకకాలంలో పుష్ప 2 సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

హిందీ వెర్షన్ మాత్రమే..

అమెరికాలో పుష్ఫ- పార్ట్ 1 తెలుగు రీ రిలీజ్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.