Allu Arjun Pushpa: ప్రయోగాత్మక పాత్రలు చేసేందుకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు బన్నీ ఎంచుకున్న పాత్రలే దీనికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. గంగోత్రి సినిమాతో మొదలైన అల్లు అర్జున్ నటన సినిమా సినిమాకు డెవలప్ అవుతూ వచ్చింది. స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు వేదంలో కేబుల్ రాజు పాత్రలో కనిపించి తనలోని నటనను బయటపెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు స్టైలిష్ లుక్‌లో కనిపించిన బన్నీ తొలి సారి పూర్తి స్థాయిలో మాస్ లుక్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో బన్నీ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, సాంగ్‌లో బన్నీ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే అప్పటి వరకు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించిన బన్నీ ఇలా మాస్‌గా అంత సులువుగా ఏం మారలేదు. ఇందుకోసం బన్నీ చాలానే కష్టపడ్డారండోయ్. భయంకరమైన స్మగ్లర్ పుష్పరాజు పాత్రలో నటిస్తున్న బన్నీ అందుకు తగ్గట్లుగానే తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ పాత్ర మేకప్ కోసం రోజుకు ఏకంగా మూడున్నరగ గంటల సమయం పట్టిందంటా. మేకప్ వేయడానికి రెండు గంటలు సమయం పడితే అది తొలగించడానికి గంటకుపైగా సమయం పట్టిందని చిత్ర యూనిట్ చెప్పింది. బన్నీ డెడికేషన్‌ను చూసిన సెట్‌లోని సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారంటా. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు నటనపై ఉన్న డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ఫ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్.. ‘దాక్కో దాక్కో మేక’ సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. రికార్డ్ వ్యూస్ సాధిస్తూ ఈ సాంగ్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
Samantha: తనను తాను సిండ్రెల్లాతో పోల్చుకున్న సమంత… ఇంట్రెస్టింగ్ ఫొటోతో ఆసక్తికరమైన క్యాప్షన్..