Pushpa: పుష్ప చిత్రయూనిట్ కార్టూన్ షేర్ చేసిన అమూల్.. సంతోషంలో అల్లు అర్జున్, రష్మిక రియాక్షన్ ఇదీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్న పుష్ప క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మొదటి సారి పక్కా ఊర మాస్ లుక్‌లో బన్నీ కనిపించడంతో అభిమానులు ఫిదా అయ్యారు. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ పుష్పరాజ్ రికార్డ్స్ క్రియేట్స్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో పుష్ప సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు తమదైన స్టైల్లో స్టెప్పులేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ అల్లు అర్జున్… సుకుమార్ సినిమాకు సరికొత్తగా అభినందనలు తెలిపింది. బన్నీ, రష్మిక పాత్రలు పోలి ఉండేలా కార్టూన్స్ క్రియేట్ చేసింది. ఈ కార్టూన్‌ను షేర్ చేసుకుంటూ అమూల్ టాపికల్ కొత్త యాక్షన్ డ్రామా సినిమా భారీ హిట్… అముల్లు.. అర్జున్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు బన్నీ. మరోవైపు ఈ ఫోస్టర్ ను షేర్ చేస్తూ రష్మిక ఆనందంలో మునిగిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు.
View this post on Instagram
Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున