Pushpa 2: ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

|

Dec 09, 2024 | 7:07 PM

పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు.

Pushpa 2: ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. నాలుగు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Pushpa 2
Follow us on

ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత.. ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌.. రూ.829 కోట్ల వసూళ్లతో ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు.  ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా నాలుగు రోజు వసూళ్లలో కూడా రూ. 829 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్ఠించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో నాలుగో రోజు ఒక్క రోజులోనే రూ.86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా సింగిల్‌ డేలో 86 కోట్ల నెట్‌ను సాధించలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

హిందీలో నాలుగు రోజులకు రూ. 291 కోట్లు కలెక్ట్‌ చేసి, ఇప్పటివరకు ఇంత త్వరగా అంటే కేవలం నాలుగు రోజుల్లోనే 291 కోట్లు కలెక్ట్‌ చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. దీంతో పాటు పలు రికార్డులు కూడా పుష్పరాజ్‌ కైవసం చేసుకున్నారు. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు.

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.