ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ, రష్మిక మందన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, డైరెక్షన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ సినిమా మొదటి రోజే రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఇక ఇప్పుడు రెండో రోజు సైతం అదే దూకుడు కొనసాగిస్తుంది.
పుష్ప 2 చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్ షేర్ చేసింది. ఈ క్రమంలోనే భారతీయ సినీ చరిత్రలో రెండు రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా వెల్లడించింది మూవీ టీం. దీంతో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 చిత్రం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమా జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. జగపతి బాబు, రావు రమేశ్, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
WILDFIRE at the box-office 🔥🔥#Pushpa2TheRule grosses 449 CRORES WORLDWIDE in 2 days ❤🔥
The fastest Indian film to hit the milestone 💥💥#RecordRapaRapAA 🔥
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/xnaUdDOMeI
— Pushpa (@PushpaMovie) December 7, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.