Pushpa 2: ఇట్స్ అఫీషియల్.. మళ్లీ మారిన పుష్ప 2 రిలీజ్ డేట్.. పుష్పరాజ్ హంగామా ఎప్పటినుంచంటే?

ఇక పుష్ప 2 లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన పాటుల చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

Pushpa 2: ఇట్స్ అఫీషియల్.. మళ్లీ మారిన పుష్ప 2 రిలీజ్ డేట్.. పుష్పరాజ్ హంగామా ఎప్పటినుంచంటే?
Pushpa 2

Edited By:

Updated on: Oct 24, 2024 | 5:28 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా విడుదల తేదీని చాలాసార్లు మార్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆగస్టు 15న సినిమా విడుదలయ్యేది. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల తేదీని డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ సినిమా విడుదల తేదీ మారింది. తాజాగా దీనికి సంబంధించి పుష్ఫ 2 టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇది చూసి బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే,, ‘పుష్ప 2’ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. దీని ప్రకారం ఈ సినిమా ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు తీసుకురావడానికి కారణం కూడా ఉంది. డిసెంబర్ 6 శుక్రవారం. అలా కాకుండా ఒకరోజు ముందుగా అంటే గురువారం విడుదల చేస్తే లాభం ఎక్కువ. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తాయి. ఆ విధంగా ‘పుష్ప 2’ గురువారం (డిసెంబర్ 5) భారీ వసూళ్లను రాబడుతోంది. కొంతమంది శుక్రవారం సెంటిమెంట్‌తో సినిమాలు చూస్తారు. శని, ఆదివారాలు వారాంతపు రోజులు కాబట్టి సహజంగానే సినిమాలు చూస్తారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశముంది.

‘పుష్ప 2’ సినిమాపై ఇప్పటికే చాలా రకాల రూమర్లు పుట్టకొచ్చాయి. . అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే టీమ్ ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్లను విడుదల చేస్తూ క్లారిటీ ఇస్తూనే ఉంది. ఇప్పుడు సినిమాను ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ముందుగానే పుష్పరాజ్ హంగామా..

కాగా మొదటి పార్ట్ కంటే మించి ఉండేలా సుమారు రూ. 500 కోట్లతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.