
ఈ మధ్యన సినిమా థియేటర్లలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రేక్షకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. కేవలం సినిమా చూడటమే కాకుండా, అందులోని ఐకానిక్ సీన్లను, సినిమా పాటలను, యాక్షన్ సీన్లను రీక్రియెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అతని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘రేస్ గుర్రం’ సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, శృతి హాసన్ అంద చందాలు, బ్రహ్మానందం కామెడీ, తమన్ పాటలతో అలరించిన ఈ సినిమాకు రీ రిలీజ్ లోనూ భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే రేసుగుర్రం సినిమా రీ రిలీజ్ ను పురస్కరించుకుని అల్లు అర్జున్ అభిమానులు తమ హీరోపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రేసుగుర్రం టైటిల్‌కు తగ్గట్లుగా కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ల లోపలికి ఏకంగా నిజమైన గుర్రాలను తీసుకువచ్చారు. థియేటర్ బయట గుర్రాలపై స్వారీ చేస్తూ, అల్లు అర్జున్ పాటలకు డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు బన్నీఫ్యాన్స్.
ప్రస్తుతం ఈ గుర్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అభిమానుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరయ్యా’.. ‘సినిమా థియేటర్ వద్దకు గుర్రాలను తీసుకురావడం అనే ఐడియా వెరైటీగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు.
రేసు గుర్రం సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లోకి గుర్రాలను తీసుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ pic.twitter.com/yx5eDT7oOf
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
కాగా పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాకా పేరుతో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.
Turn up the volume! 🔊 💥#MakeWayForTheKing theme from #Raaka ! ⚡⚔️
🎵 https://t.co/cy0ZMFIvr4@alluarjun @Atlee_dir @deepikapadukone @SaiAbhyankkar pic.twitter.com/DlQjVtrYhT
— Sun Pictures (@sunpictures) April 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.