ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా జీవించేశాడని చెప్పొచు. ఆయన నటన, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి.
ఇక పుష్ప 2 కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ వన్ కు మించి పార్ట్ 2 తెరకెక్కించనున్నారు సుకుమార్. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ రోజు (గురువారం)హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు.
అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ లో బన్నీ ఇంకా జాయిన్ అవ్వలేదట. హీరోతో అవసరం లేని కొన్ని కీలక ఘట్టాలని దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. ఆతర్వాత బన్నీ జాయిన్ అయిన తర్వాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. హైదరాబాద్ తర్వాత థాయ్ లాండ్ లో 15 రోజుల పాటు కీలక ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..