నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నేను ఒక వారం రోజుల క్రితం సినిమా చూడటం జరిగింది. చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఎందుకు మొహం ఇంత వెలిగిపోతుంది అని అడిగారు. మగధీర ముందు మీ మొహం ఎంత వెలిగిపోవడం చూశాను. మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను అని ఆమె అన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ, సుకుమార్ భార్య భబితకు అవార్డులు అన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఇంతగా సపోర్ట్ చేసినందుకు. అలాగే ఈ సినిమాలో నేను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాలి. ఎంత బాగా నటించింది అంటే పుష్ప 1 సినిమాలో ఆమె నటన ఈ సినిమాతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో అంత బాగా చేసింది. ఇక శ్రీలీల ఉండేది తక్కువ సమయమైనా చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ నాకు తన చిన్నతనం నుండి తెలుసు. తన తండ్రి నా స్నేహితుడు. తను ఇంత మంచి హిట్స్ కొట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఒక నిర్మాతగా నేను చెప్తున్నాను మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే అతిపెద్ద నిర్మాతలు. వారు ఇన్ని సినిమాలు ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఎలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందరికీ ఆల్ ద బెస్ట్” అంటూ ముగించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.