Adipurush: వివాదంలో ఆదిపురుష్.. సెన్సార్ బోర్డ్ పై హైకోర్ట్ సీరియస్.. చిత్రయూనిట్ పై అసహనం..

|

Jun 27, 2023 | 6:13 PM

ఇందులో రాముడు, రావణుడు, హనుమ కాస్ట్యూమ్స్, డైలాగ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని.. చిత్రాన్ని బ్యా్న్ చేయాలంటూ పలు కోర్టులలో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఇక ఈ సినిమాలోని పలు డైలాగ్స్ తొలగించాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు సెన్సార్ బోర్డ్ తీరుని తప్పుబట్టింది.

Adipurush: వివాదంలో ఆదిపురుష్.. సెన్సార్ బోర్డ్ పై హైకోర్ట్ సీరియస్.. చిత్రయూనిట్ పై అసహనం..
Adipurush
Follow us on

భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్రస్తాయిలో విమర్శలు ఎదుర్కొన్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ తీర్చిదిద్దిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి.. సినీ ప్రముఖుల వరకు అనేక విమర్శలు వచ్చాయి. ఓవైపు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. ఓంరౌత్ రామాయణాన్ని అపహాస్యం చేశారని.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు.. డైలాగ్స్ రామాయాణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే ఆరోపించారు. ఇందులో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో రాముడు, రావణుడు, హనుమ కాస్ట్యూమ్స్, డైలాగ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని.. చిత్రాన్ని బ్యా్న్ చేయాలంటూ పలు కోర్టులలో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఇక ఈ సినిమాలోని పలు డైలాగ్స్ తొలగించాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు సెన్సార్ బోర్డ్ తీరుని తప్పుబట్టింది.

సెన్సార్ కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ ను ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సన్నివేశాల వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని సీరియస్ అయ్యింది. అలాగే విచారణకు దర్శకుడు, నిర్మాత ఇద్దరు హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

ఈ చిత్రానికి మనోజ్ ముంతాషిర్ డైలాగ్స్ రాశారు. ఇక ఇందులో హనుమ చెప్పే ఓ డైలాగ్ పై సినీప్రముఖులు, ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిత్రయూనిట్ వెనక్కు తగ్గి డైలాగ్స్ మార్చింది. అయినప్పటికీ ఈ సినిమాపై విమర్శలు తగ్గడం లేదు. ఇక అదే సమయంలో తాము అసలు రామాయణాన్ని తెరకెక్కించలేదని.. కేవలం ఆధారంగా మాత్రమే తీసుకున్నామని రచయిత మనోజ్ ముంతాషిర్ అన్నారు. దీంతో మనోజ్ మాటలపై మరోసారి విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి