ఆలియా భట్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో హీరోయిన్ కావడమే. ఇన్ని రోజులు దీనిపై కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసాడు దర్శక ధీరుడు. తన సినిమాలో ఆలియా భట్ ఉందని చెప్పేసాడు. రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తుంది ఆలియా. దాంతో ఇప్పుడు ఈమె గురించి మన తెలుగు ప్రేక్షకులు తెగ వెతికేస్తున్నారు.
బాలీవుడ్ జనాల్ని ఆకర్షించేందుకు అలియా భట్‌ను తెరపైకి తీసుకువచ్చారు రాజమౌళి. రామ్ చరణ్‌కి జోడీగా సీత పాత్రలో మెప్పించనుంది అలియా. అయితే అలియా భట్ నటనను చూసేందుకు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నా అంటూ ప్రేక్షకుల మాదిరే ఆసక్తిగా ట్వీట్ చేశారు రాజమౌళి. అంతేకాదు సుమారు రూ. 400 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్ కోసం ఏకంగా రూ. 12 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్‌లో రూ. 10 కోట్లు రేటు పలుకుతున్న అలియా RRR కోసం మరో రెండు కోట్లు ఎక్కువ చెప్పడం.. దానికి నిర్మాతల నుండి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. మరి రామరాజు పక్కన సీతగా అలియా రూ.12 కోట్లు రెమ్యునరేషన్‌కి తగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చి.. ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. అన్నట్టు నేడు (మార్చి 15) ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ బర్త్ డే.