స్టంట్స్‌తో మరోసారి ఆకట్టుకున్న అక్షయ్

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ మరోసారి తన విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ పోలీస్ సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా హెలికాప్టర్ నుంచి వేలాడుతూ అక్షయ్ స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ ఫోటోలను తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు. మామూలుగానే హెలికాప్టర్ నుంచి వేలాడను. సూర్యవంశీ సెట్‌లోని ఓ యాక్షన్ సీన్ ఇది. ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేసినవి.. ఇలాంటి స్టంట్స్ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 12:03 pm, Thu, 6 June 19
స్టంట్స్‌తో మరోసారి ఆకట్టుకున్న అక్షయ్

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ మరోసారి తన విన్యాసాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ పోలీస్ సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్‌లో భాగంగా హెలికాప్టర్ నుంచి వేలాడుతూ అక్షయ్ స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ ఫోటోలను తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు.

మామూలుగానే హెలికాప్టర్ నుంచి వేలాడను. సూర్యవంశీ సెట్‌లోని ఓ యాక్షన్ సీన్ ఇది. ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేసినవి.. ఇలాంటి స్టంట్స్ రియల్ లైఫ్ లో అభిమానులెవరూ చేయద్దంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు.

అక్ష‌య్ పోస్టు చేసిన ఆ ఫోటోలో వేగంగా వెళుతున్న హెలికాఫ్టర్ నుంచి కిందకి వేలాడుతూ… బైక్​పై వెళుతున్న విలన్​ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిసిస్తుంది. ఇక ఈ సినిమాను రోహిత్ శెట్టి – క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.