“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 13, 2020 | 4:56 PM

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రూ.కోట్లు సంపాదించి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకోవడమే కాదు, ఈ కరోనా సమయంలో ఎన్నో డొనేషన్స్ చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన సినీ కెరీర్‌ స్టార్ట్ చెయ్యడానికి ముందు డబ్బులు కోసం  చాలా చిన్న,చిన్న జాబ్స్  చేశారు. ఆ రోజుల్ని అక్షయ్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. కిలాడీ హీరో ఇటీవల బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ‘ఇన్‌ టు ది వైల్డ్‌’ షో కోసం సాహసాలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ ఎపిసోడ్‌ డిస్కవరీ ప్లస్‌ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కర్ణాటకలోని బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఈ షూట్‌ జరిగింది. ఈ క్రమంలో అక్షయ్‌ తన లైఫులోని పలు సందర్భాల్ని గుర్తు చేసుకున్నారు.

‘థాయిలాండ్‌లో వెయిటర్‌గా వర్క్ చేస్తోన్న రోజుల్లో చాలా ఫ్రీగా ఉండేవాడిని. ఇప్పుడు నాకు కావాల్సినంత సంపదఉంది. కానీ అప్పటి పరిస్థితులు పూర్తిగా వేరు. ఎంతో స్వేచ్ఛగా బ్రితికేవాడిని. వెయిటర్ గా పనిచచేస్తున్న సమయంలో ఓసారి ఓ మహిళ నాకు టిప్పుగా ముద్దుపెట్టింది’ అని చెప్పుకొచ్చారు.

అనంతరం మోడలింగ్‌లోకి రావడం గురించి వివరిస్తూ.. ‘నేను మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌గా ఉన్నప్పుడు అనుకోకుండా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టా. నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ అబ్బాయి తండ్రి మోడలింగ్‌ షూట్‌కి వెళ్లమని నాకు సజిషన్ ఇచ్చారు. డబ్బులు వస్తాయని నేనూ ఆసక్తి కనబరిచా. రెండు గంటల షూట్‌కు రూ.21 వేల చెక్‌ ఇచ్చి పంపారు. నిజంగా అద్భుతంగా అనిపించింది. నేను నెలంతా కష్టపడి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినా రూ.5వేలు మాత్రమే వస్తుంది. అలాంటిది రెండు గంటల వ్యవధిలో ఇంత సంపాదించడం హ్యాపీగా అనిపించింది. ఆపై నటుడిగా మారా..’ అని అక్షయ్‌ పేర్కొన్నారు.

Also Read :

దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !