Samantha Family Man2: హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న నటీమణుల్లో సమంత ఒకరు. ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు కుర్కకారును నిజంగానే మాయ చేసిన సమంత అనంతరం వరుస సినిమాలతో టాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక తనను తెలుగులో పరిచయం చేసిన నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న ఈ చైన్నై చిన్నది తెలుగు వారి కోడలిగా మారింది. వివాహం తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న సామ్.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో సమంత తనలోని మరో కోణాన్ని వెలికితీస్తూ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. కెరీర్‌లో తొలిసారి సమంత నెగిటివ్ రోల్‌లో నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో సమంత అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనలో తనకు నచ్చే విషయాలు ఎంటన్నదానిపై సమంత మాట్లాడుతూ.. నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సమంత చెప్పుకొచ్చారు. ఇక భర్త నాగచైతన్యతో ఎప్పుడైనా గొడవలు జరుగుతాయా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అప్పుడప్పడు గొడవలు జరుగుతాయని కానీ.. ప్రతిసారీ మొదట రాజీ పడేది తనేనని చెప్పుకొచ్చింది సామ్.
Also Read: Madhuri Dixit: ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’.. ఆ అందాల బొమ్మకు 54 ఏళ్లు అంటే నమ్ముతారా…?
Akhil Movie: అఖిల్ సినిమాలో మరో సూపర్ స్టార్.. కీలక పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్ర ?..
Tollywood: టాప్ మూవీస్‌కు రీ-షూట్ బెడద.. రిపేర్లు తప్పవట.. వివరాలు