Akkineni Nagarjuna: ది ఘోస్ట్ సినిమాపై నాగ్ ఆసక్తికర కామెంట్స్.. ఆలోచన అలా మొదలైందంటూ..

|

Jul 09, 2022 | 7:11 PM

'ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి.

Akkineni Nagarjuna: ది ఘోస్ట్ సినిమాపై నాగ్ ఆసక్తికర కామెంట్స్.. ఆలోచన అలా మొదలైందంటూ..
Akkineni Nagarjuna
Follow us on

కింగ్ అక్కినేని నాగార్జున (akkineni nagarjuna) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా శనివారం ది ఘోస్ట్ సినిమా ఫస్ట్ విజువల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం చిత్రం ప్రమోషన్ లను ‘కిల్లింగ్ మెషిన్’ తో ప్రారంభించారు. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ గా కనిపించారు.

నాగార్జున మాట్లాడుతూ.. ‘ది ఘోస్ట్ ‘లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. సునీల్ నారంగ్ గారి నాన్నగారు నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైయింది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం” అన్నారు