Bangarraju : అప్పుడు ఆ సినిమాకు చేశాం.. ఇప్పుడు బంగార్రాజుకు చేస్తున్నాం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగ చైతన్య..

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bangarraju : అప్పుడు ఆ సినిమాకు చేశాం.. ఇప్పుడు బంగార్రాజుకు చేస్తున్నాం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగ చైతన్య..
Naga Chaithanya

Updated on: Jan 10, 2022 | 3:53 PM

Bangarraju : కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బంగార్రాజు సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బంగార్రాజు సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ..

‘మనం సినిమాకు ఇలాంటి ఫంక్షన్ చేశాం. బంగార్రాజుకు మళ్లీ ఇలా చేయడం ఆనందంగా ఉంది అన్నాడు. ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఒక్క పాట హిట్ అయితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది ఈ సినిమా కోసం అనూప్ అద్బుతమైన ఆల్బమ్ ఇచ్చారు. అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతీ సినిమా, ఆల్బమ్ హిట్ అయింది. ప్రతీ ఒక్కరి ఇన్ పుట్స్ తీసుకునేవారు.అలాగే మా లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బంగారం లాంటి పాత్ర ఇచ్చినందుకు నాన్నకు, కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. అంచనాలకు తగ్గట్టుగానే మా సినిమా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు చైతన్య. అలాగే నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోకుజనవరి 14 చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్.  సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. బంగార్రాజుకు చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను అని అన్నారు నాగ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..