AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Chinmayi: సైనా నెహ్వాల్‏పై హీరో సిద్ధార్థ్ కామెంట్స్.. అలా అనడం అవమానమంటూ సింగర్ చిన్మయి అసహనం..

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ .. బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటున్నాడు.

Singer Chinmayi: సైనా నెహ్వాల్‏పై హీరో సిద్ధార్థ్ కామెంట్స్.. అలా అనడం అవమానమంటూ సింగర్ చిన్మయి అసహనం..
Siddarth
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2022 | 3:06 PM

Share

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ .. బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటున్నాడు. సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాంటూ శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహ పలువురు ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్ పూర్ కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని వాహనాలను రైతులు అడ్డిగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నరేంద్ర మోడీ భద్రత లోపం గురించి సోషల్ మీడియా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై సైనా నేహ్వల్ స్పందిస్తూ.. మా ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. ఈ పిరికివాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను అంటూ ట్విట్ చేసింది. అయితే సైనా నేహ్వాల్ చేసిన కామెంట్స్ ను రీట్వీట్ చేస్తూ.. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా అంటూ ట్వీట్ చేశాడు.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ను పలువురు ప్రముఖులు ఖండించారు. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించారు. మహిళలను అవమానకరించేలా పదాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ” ఇది నిజంగా దారుణం. సిద్ధార్థ్ మాలో చాలా మంది మహిళలు పోరాడుతున్న విషయాలకు మీరు సహకరించారు. కానీ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వర్ల్డ్ ఆ పదానికి మరో అర్ధం ఉంది.. అమ్మాయిని ఆ పదంతో సంబోధించడం అవమానకరం ” అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.

Chinmayi

Chinmayi

ఇదిలా ఉంటే జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్ధార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. సిద్దార్థ్ చేసిన పోస్ట్ స్త్రీ ద్వేషం, మహిళల గౌరవానికి అవమానం కలిగించే విధంగా ఉందని పేర్కోంది. ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేసి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్రకు లేఖ రాశారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలం వాడినందుకు అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ కోరింది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..