‘ధూత’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు చైతూ. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ కు విక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతకుముందు ఈసిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న చైతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటికే అనేకసార్లు వ్యక్తిగత జీవితం గురించి స్పందించాడు చైతూ. కానీ మరోసారి ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి చైతూ మాట్లాడుతూ.. ఒక పాయింట్ తర్వాత దాని గురించి పట్టించుకోనని.. నిజమేంటో తనతో ఉండేవారికి తెలుస్తుందని అని అన్నాడు.
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత వచ్చిన రూమర్స్ గురించి చైతూ స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందో దాని గురించి కాకుండా తన సినిమాల గురించి మాట్లాడడమే తన లక్ష్యమని చెప్పాడు. “నేను నిజంగా ఒక పాయింట్ దాటిన తర్వాత దాని గురించి పట్టించుకోను. నా సన్నిహితులకు, సన్నిహితులకు మాత్రమే నిజం తెలుసు. అలా కాకుండా, నా వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందో దాని కంటే నటుడిగా నా పనికి నేను గుర్తింపు పొందాలనుకుంటున్నాను. కాబట్టి నేను నా పనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను నటించే సినిమాలు మాత్రమే మాట్లాడతాయి. నా సినిమాలు గొప్పగా, ప్రేక్షకులను అలరించి… వాటి ద్వారా ప్రజలు నన్ను గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఇక చైతూ విషయానికి వస్తే.. సస్పెన్స్-థ్రిల్లర్‌గా వచ్చిన ధూత సిరీస్.. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌స్ ఉన్నాయి. ఇందులో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలకపాత్రలలో నటించారు. తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, తాను యాక్టింగ్ స్టూడెంట్‌గా ముంబైలో దాదాపు నాలుగు నెలలు గడిపానని చైతూ చెప్పాడు. ఇక ధూత సిరీస్ ద్వారా ఇప్పటికీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇలాంటివి ప్రయత్నించాలనుకుంటున్నానని అన్నారు చైతూ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.