AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni : ఒక్క సాలిడ్ హిట్ పడితే మా హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఒక గెస్ట్ రోల్ లో మెరిశాడు. అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్.

Akhil Akkineni : ఒక్క సాలిడ్ హిట్ పడితే మా హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..
Akhil
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2021 | 9:09 AM

Share

Akhil Akkineni :

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. ఒక గెస్ట్ రోల్ లో మెరిశాడు. అక్కినేని ఫ్యామిలీ మెమరబుల్ హిట్ మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అఖిల్. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అనే సినిమా చేసాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మనం దర్శకుడు విక్రమ్తో కుమార్ తో ‘హలో’ అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ వెంటనే ‘మిస్టర్ మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా విజయాన్ని అందుకోలేక పోయింది. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమా అయ్యాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక అఖిల్ 5వ  సినిమాను ఏకంగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు ‘ఏజంట్’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే ఈ యంగ్ హీరో మరో సినిమా  చేయబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా ఓ భారీ బ్యానర్ లో..

మైత్రి మూవీ మేకర్స్ వారు అఖిల్ తో సినిమాను షురూ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. ఇలా వరుస గా మూడు సినిమాలతో వస్తున్నాడు అఖిల్.  కనీసం వీటిలో రెండు సినిమాలు పక్క హిట్ అవుతాయని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఒక్క సాలిడ్ హిట్ పడితే తమ అభిమాన హీరో టాలీవుడ్ లో స్టార్ గా మారిపోతాడని ఫాన్స్  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అక్కినేని అభిమానుల ఆకాంక్ష తీరుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pranitha: పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాం.. రిసిప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేస్తాం. వివాహంపై స్పందించిన‌ ప్ర‌ణీత‌.

Jagame Thanthiram: ఆస‌క్తిరేకెత్తిస్తోన్న ధ‌నుష్ కొత్త చిత్రం… 17 భాష‌లు, 190 దేశాల్లో విడుద‌ల‌..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..