Manam Movie: మళ్లీ రిలీజ్ అవుతున్న అక్కినేని క్లాసిక్ హిట్.. విడుదల ఎప్పుడంటే..

నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో తన తండ్రి లెగసిని కొనసాగించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సహజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. నాగార్జున దారిలోనే అక్కినేని వారసులు సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ నటులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నటులుగా, నిర్మాతలుగా అక్కినేని మూడోతరం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Manam Movie: మళ్లీ రిలీజ్ అవుతున్న అక్కినేని క్లాసిక్ హిట్.. విడుదల ఎప్పుడంటే..
Manam Movie

Updated on: May 17, 2024 | 2:37 PM

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. వైవిధ్యమైన సినిమాలతో ఇండస్ట్రీలోనే ఒక లెజెండరీగా నిలిచిపోయారు. ఆ తర్వాత నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో తన తండ్రి లెగసిని కొనసాగించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సహజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. నాగార్జున దారిలోనే అక్కినేని వారసులు సుమంత్, సుశాంత్, నాగచైతన్య, అఖిల్ నటులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నటులుగా, నిర్మాతలుగా అక్కినేని మూడోతరం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన సినిమా మనం. ఇది నాగేశ్వరరావు చివరి సినిమా. ఇందులో నాగేర్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అఖిల్, అమల అతిథి పాత్రలు పోషించారు. ఈ ఈ సినిమా విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా.. మరోసారి మనం చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

ఈనెల మే 23న మనం సినిమాను మరోసారి రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ షోలు వేయనున్నారు. హైదరాబాద్ లో దేవి 70mm థియేటర్, వైజాగ్ లోని శరత్ థియేటర్, విజయవాడలోని స్వర్ణ మల్టీప్లెక్స్ లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మనం సినిమా గురించి చైతన్య, చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.