తండ్రీకొడుకులుగా తక్కువ ఫ్రెండ్స్ లా ఎక్కువ కనిపించే నాగ్, అఖిల్.. ఇప్పుడు ఒకే సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ తండ్రి కొడుకులకు సంబంధించిన ఓ కామన్ పాయింట్ను పట్టిన అక్కినేని అభిమానులు.. ఇక ఈ పాయింట్‌ను హైలెట్ చేస్తూ… నెట్టింట మీమ్స్ కూడా వదులుతున్నారు. అక్కినేని అఖిల్ తన 15 నెలలకే సిసింద్రీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున కూడా తన 15 నెలలకే “సుడిగుండాలు” తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ కామన్ పాయింట్‌ని క్యాచ్‌చేసిన అక్కినేని అభిమానులు.. ఈ పాయింట్‌ను వైరల్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నారు. ఏజెంట్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :