పొంగల్ బరిలో దిగేందుకు రెడీ అవుతున్న అజిత్.. ఈ సారి తెలుగు మార్కెట్ మీద కూడా సీరియస్‌గానే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. గత అనుభవాలతో ఎలర్ట్ అయిన అజిత్ టీమ్… నెక్ట్స్ మూవీ విషయంలో ముందు నుంచే జాగ్రత్త పడుతోంది. 2023 పొంగల్ బరిలో దిగేందుకు తునివు సినిమాతో రెడీ అవుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. నిన్నమొన్నటి వరకు రిలీజ్ విషయంలో ఉన్న సస్పెన్స్‌కు ఫస్ట్ సాంగ్ అప్‌డేట్‌తో క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. సంక్రాంతికి వార్ డిక్లేర్ చేసిన అజిత్… మార్కెట్ ఎక్స్‌ఫాన్షన్ విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు.
రీసెంట్ టైమ్స్‌లో అజిత్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా ప్యారలల్‌గా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ సినిమా ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం కేర్ తీసుకోకుండా ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేసి వదిలేశారు. దీంతో టాలీవుడ్‌లో మార్కెట్ కాపాడుకోలేకపోయారు అజిత్. లాస్ట్ మూవీ వలిమై విషయంలోనూ అదే జరిగింది. భారీగా తెరకెక్కిన వలిమై సినిమాను లాస్ట్ మినిట్ వరకు తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చిన తరువాత ఎలాంటి ప్రిపరేషన్, ప్రమోషన్ లేకుండా హరీ బరీగా తమిళ టైటిల్‌తోనే తెలుగులోనూ రిలీజ్ చేశారు. దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్‌కు రీచ్ అవ్వలేదు.
కానీ తునివు విషయంలో ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు మేకర్స్. అందుకే తమిళ్‌తో పాటు తెలుగు ప్రమోషన్ కూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు తెగింపు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. నెక్ట్స్ వీక్ నుంచి తెలుగు వర్షన్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్.