Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన షామిలి సిస్టర్స్.. 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ముగ్గురూ..
ఈ ముగ్గురు చిన్నారులతో చిరు చేసిన అల్లరి.. యాక్టింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇదిలా ఉంటే వీరు ముగ్గురు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టీం ఒకే ఫ్రేములో కనిపించింది. షాలిని, షామిలి, రిషి ముగ్గురు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇందులో చిరు సరసన దివంగత హీరోయిన్ శ్రీదేవి కథానాయికగా నటించగా.. అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. 1990లో విడుదలైన ఈ సినిమాలో బెబీ షాలిని, షామిలి, వీరిద్దరి సోదరుడు రిషి ముగ్గురు చైల్డ్ ఆరిస్టులుగా నటించి అలరించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు చిన్నారులతో చిరు చేసిన అల్లరి.. యాక్టింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇదిలా ఉంటే వీరు ముగ్గురు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టీం ఒకే ఫ్రేములో కనిపించింది. షాలిని, షామిలి, రిషి ముగ్గురు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఫోటోతోపాటు.. ఇప్పుడు తీసుకున్న ఫోటోను కొలైజ్ చేసి షేర్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టింట హల్చల్ అవుతుంది. చాలా కాలం తర్వాత షామిలి సిస్టర్స్ చిరుతో కలిసి కనిపించడంపై డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. షాలిని, షామిలి ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక సినిమాల్లో బాలనటులుగా అలరించారు. ఆ తర్వాత హీరోయిన్లుగా అనేక చిత్రాల్లో కనిపించారు. అలాగే వీరి సోదరుడు రిషి కూడా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏ ఫిలిం బై అరవింద్, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అవతారం వంటి చిత్రాల్లో హీరోగా మెరిసాడు.
అలాగే షాలిని నటించిన సఖి చిత్రం తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో షాలిని నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక వీరి చెల్లెలు షామిలి తెలుగులో ఓయ్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. షాలిని, షామిలి పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. షాలిని కోలీవుడ్ హీరో అజిత్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్ సెట్ లో సందడి చేశాడు అజిత్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.