Aishwarya Rajesh : బాక్సింగ్ పాక్టీస్ లో బిజీగా బిజీగా హీరోయిన్.. ఆ సినిమా కోసమేనా అమ్మడి కష్టాలు..

ఐశ్యర్వ రాజేష్..! తమిళ్ లో వర్సటైల్ క్యారెకర్స్ చేస్తూ పాపులుర్ అయిన ఈ తెలుగమ్మాయి.. "వరల్డ్‌ ఫేమస్‌ లవర్" సినిమాతో మనకు కూడా దగ్గరయ్యారు.

Aishwarya Rajesh : బాక్సింగ్ పాక్టీస్ లో బిజీగా బిజీగా హీరోయిన్.. ఆ సినిమా కోసమేనా అమ్మడి కష్టాలు..

Updated on: Jun 10, 2021 | 10:11 PM

Aishwarya Rajesh :

ఐశ్యర్వ రాజేష్..! తమిళ్ లో వర్సటైల్ క్యారెకర్స్ చేస్తూ పాపులుర్ అయిన ఈ తెలుగమ్మాయి.. “వరల్డ్‌ ఫేమస్‌ లవర్” సినిమాతో మనకు కూడా దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇన్‌స్టాలో ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉండే ఐశ్వర్య.. తాజాగా ఓ వీడియోను వారితో పంచుకున్నారు. పర్ఫెక్ట్ బాక్సర్‌లా బాక్సింగ్ చేస్తూ ఆ వీడియోలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక క్యారెక్టర్‌ కోసం రిస్క్‌ తీసుకునే ఐశ్యర్య ఇంతలా బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తుండడంతో… ఉండబట్టలేని కొందరు అభిమానులు “ఏ సినిమా కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నారు మేడం” అంటూ కమెంట్లలో ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరి కొందరు “బాక్సింగ్‌ నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేస్తున్నారు కావచ్చు” అంటూ.. కన్ఫర్మ్‌ చేసేస్తున్నారు. ఇక తెలుగు అభిమానులు మరో అడుగు ముందుకోసి పవన్‌ “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాకోసం కావచ్చు అంటూ ఊహిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?

Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..

Nani : ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్ నాని.. షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు..