Aishwarya Rai: ఇకనైనా ఆ రూమర్లు ఆగుతాయా? ఐశ్వర్య, అభిషేక్‌ బచ్చన్‌ల వీడియో వైరల్.. కూతురితో కలిసి..

గత కొన్ని రోజుల నుంచి అభిషేక్-ఐశ్వర్యల సంబంధం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం అభిషేక్ ఒక ఇంటర్వ్యూలో ఆ పుకార్లన్నింటినీ తోసిపుచ్చారు. అవి కేవలం రూమర్లేనని గట్టిగా చెప్పారు. తన మాటలకు బలం చేకూరేలా ఇప్పుడు ఐశ్వర్య, అభిషేక్ ల వీడియో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

Aishwarya Rai: ఇకనైనా ఆ రూమర్లు ఆగుతాయా? ఐశ్వర్య, అభిషేక్‌ బచ్చన్‌ల వీడియో వైరల్.. కూతురితో కలిసి..
Aishwarya Rai Family

Updated on: Dec 24, 2025 | 8:45 AM

బాలీవుడ్‌లో బచ్చన్ కుటుంబం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యన బచ్చన్ కుటుంబంలోని కొడుకు, కోడలు అభిషేక్-ఐశ్వర్య మధ్య దాంపత్య బంధం గురించి వివిధ పుకార్లు వ్యాపిస్తున్నాయి. వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, కొన్ని రోజుల క్రితం అభిషేక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, ఆ పుకార్లన్నింటినీ తోసిపుచ్చార అభిషేక్. దీని తర్వాత అభిషేక్-ఐశ్వర్య మాత్రమే కాకుండా బిగ్ బి కూడా ఆరాధ్య స్కూల్ ప్రోగ్రామ్‌కు వచ్చారు. ఇప్పుడీ సెలబ్రిటీ జంట తమ కూతురితో విదేశాలకు వెళ్లారు. వారు ముగ్గురూ క్రిస్మస్ సెలవులకు విదేశాలకు వెళ్లారు. తాజాగా వీరు విమానాశ్రయంలో జంటగా కనిపించారు. ఎయిర్ పోర్టులో అభిషేక్-ఐశ్వర్య ల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సుమారు రెండు సంవత్సరాలుగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ల సంబంధం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట విడిపోతున్నారని పలు మీడియా సంస్థలు కూడా కోడై కూశాయి. కానీ ఇటీవలే ఆరాధ్య స్కూల్ ఫంక్షన్‌కు కుటుంబ సభ్యులంతా కలిసి హాజరయ్యారు. దీంతో వీరి విడాకుల వార్తలకు తెరపడినట్లయింది. అంతకు ముందు అభిషేక్ కూడా ఒక ఇంటర్వ్యూలో విడాకుల వార్తలను ఖండించారు. ఇప్పుడు వీరు ముగ్గురూ మళ్ళీ కలిసి విహారయాత్రకు వెళుతున్నట్లు కనిపించారు. ముగ్గురూ నల్లటి దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు “మెర్రీ క్రిస్మస్” శుభాకాంక్షలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో ఆరాధ్యతో ఐశ్వర్యరాయ్ బచ్చన్- అభిషేక్.. వీడియో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి “కింగ్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ఇక ఐశ్వర్యారాయ్ బచ్చన్ య చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఆమె చివరిగా పొన్నియన్ సెల్వన్ 2 మూవీలో నటించింది.

కూతురు ఆరాధ్యతో ఐశ్వర్యారాయ్ బచ్చన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.