aha: ఈ వారం ఆహాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇవే.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పక్కా

|

Nov 01, 2022 | 4:30 PM

ఇక ఇప్పటికే ఆహా లో స్ట్రీమింగ్ అవుతోన్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ టాక్ షో సీజన్ 2 లోకి అడుగుపెట్టింది. తొలి ఎపిసోడ్ నుంచి బాలయ్య షో అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతోంది.

aha: ఈ వారం ఆహాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇవే.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పక్కా
Aha
Follow us on

అచ్చమైన తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ సినిమాలతోపాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అలరించే టాక్ షోలు, అదిరిపోయే గేమ్ షోలతోనూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. ఇక ఇప్పటికే ఆహా లో స్ట్రీమింగ్ అవుతోన్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ టాక్ షో సీజన్ 2 లోకి అడుగుపెట్టింది. తొలి ఎపిసోడ్ నుంచి బాలయ్య షో అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతోంది. సెకండ్ సీజన్ లో ఇప్పటికే నారా చంద్రబాబు, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరయ్యి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ కు సిద్ధం అయ్యింది అన్ స్టాపబుల్. ఈ ఎపిసోడ్ లో మరో ఇద్దరు కుర్ర హీరోలు శర్వానంద్ అడవి శేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

నవంబర్‌ 4వ తేదీ నుంచి ఎపిసోడ్‌3 టెలికాస్ట్‌ అవుతోంది. అలాగే ఆహాలో ఆకట్టుకుంటున్న వాటిలో డాన్స్ ఐకాన్ ఒకటి. సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో కంటెస్టెంట్స్ దుమ్మురేపుతున్నారు. ఈ కార్యక్రమానికి స్సెషల్ గెస్ట్ గా ముద్దుగుమ్మ రాశిఖన్నా హాజరుకానున్నారు. ఓంకార్ హౌస్ చేస్తోన్న ఈ షోకు రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శనివారం , ఆదివారం ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న హోస్ట్ గా చేస్తోన్న షో చెఫ్ మంత్ర. ఈ షోలో గెస్ట్ లుగా వచ్చిన వారు తమకు నచ్చిన వంటకాన్ని వండి.. దానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను హాజరుకానున్నారు. ఇలా ఈ మూడు షోలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..