
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ లోని నెపొటిజంపై పలువురు సెలబ్రిటీలు దుమ్మెత్తి పోస్తున్నారు. తాము కూడా మనసులో ఎన్నో బాధలు ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నామని.. అవన్నీ బయటకు వ్యక్తపరచాల్సిన సమయం వచ్చిందని..వారి జీవితంలోని చేదు అనుభవాల గురించి ప్రపంచానికి చెబుతున్నారు. తాజాగా నటి అయేషా టాకియా ఇన్‌స్టా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. కెరీర్ పరంగా తాను కూడా ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నానని.. ఇబ్బందులకు గురిచేస్తోన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎన్నో సందర్భాల్లో ట్రోలింగ్, బెదిరింపులు ఎదుర్కొన్నానని తెలిపిన ఆమె..ఎదుటి వ్యక్తుల మాటలు పట్టించుకుని మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకండని సూచించారు. మనకు దక్కాల్సిన దాని గురించి పోరాటం చేయడానికే అందరం ముందుకు వెళ్లాలని.. ఇబ్బంది పెట్టిన వారిని గెలవనివ్వకండి కోరారు. ఇలాంటివి చేయడం కంటే చెప్పడం చాలా తేలికన్న అయేషా… మన భవిష్యత్తు తరాల బాగు కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘సూపర్’ మూవీలో అయేషా నటించిన విషయం తెలిసిందే.