AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో పెళ్లికి సిద్ధమైన నటి, ‘బిగ్‌బాస్’ ఫేమ్‌

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోనూ పలువురు ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివాహం చేసుకోగా..

మూడో పెళ్లికి సిద్ధమైన నటి, 'బిగ్‌బాస్' ఫేమ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 18, 2020 | 3:42 PM

Share

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలోనూ పలువురు ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివాహం చేసుకోగా.. ఈ నెలలో మరో నటి పెళ్లికి రెడీ అయ్యింది. ప్రముఖ నటి, ‘బిగ్‌బాస్ 3’ ఫేమ్‌ వనితా విజయ్‌ కుమార్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 27న ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాల్‌లో వనితా వివాహం జరగనుంది. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటనను ఇచ్చింది. తన స్నేహితుడు పీటర్ పాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె వెల్లడించింది.

కాగా ప్రముఖ సినీ దంపతులు విజయ్‌కుమార్, మంజులల పెద్ద కుమార్తె వనితా విజయ్‌కుమార్. ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వనితా.. పలు చిత్రాలు, సీరియల్‌లో నటించారు. తెలుగులోనూ ‘దేవి’ చిత్రంలో కనిపించారు. ఈ క్రమంలో 2000లో నటుడు ఆకాశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. 2007లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. ఈ ఇద్దరికి ముగ్గురు పిల్లలు(అబ్బాయి, కవల అమ్మాయిలు) ఉన్నారు. ఇక 2007లో వ్యాపారవేత్త జయ్ రాజన్‌ను వనితా రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా 2012లో విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు వనితా. ఈ ఇద్దరు 2017లో విడిపోగా.. ఇప్పుడు పీటర్‌ పాల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారు.

ఈ సందర్భంగా ఓ ప్రకటనను ఇచ్చిన వనితా.. తన జీవితంలోకి పీటర్ ఓ వెలుగులా వచ్చారని, బాధల్లో ఉన్నప్పుడు ఎంతగానో భరోసా ఇచ్చారని, తన యూట్యూబ్ ఛానెల్‌కి సైతం మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని పీటర్ అడిగినప్పుడు పిల్లలు ఒప్పుకోవాలని చెప్పానని, ఇక పీటర్ వారిని అడిగినప్పుడు ఆశ్చర్యంగా ఎగిరి గంతేశారని, అది తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వనితా చెప్పుకొచ్చారు. ఇక ఈ పెళ్లికి ఇరు వర్గాల నుంచి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు.

Read This Story Also: Breaking: జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు షాక్

Follow Us
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?