Hero Darshan: హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ అరెస్ట్ కావడం యావత్ భారత సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. అభిమానులకు ఆదర్శంగా, అండగా ఉండాల్సిన స్టార్ హీరో తన వీరాభిమానిని హత్య చేశాడన్న ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Hero Darshan: హీరో దర్శన్ అరెస్టుతో మనస్తాపం.. ఆత్మహత్య చేసుకున్న అభిమాని
Hero Darshan

Updated on: Jun 18, 2024 | 8:08 AM

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ అరెస్ట్ కావడం యావత్ భారత సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. అభిమానులకు ఆదర్శంగా, అండగా ఉండాల్సిన స్టార్ హీరో తన వీరాభిమానిని హత్య చేశాడన్న ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ విషయంలో దర్శన్ ను క్షమించకూడదని, అతనికి కఠిన శిక్ష వేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇదేమీ పట్టని కొందరు అభిమానులు దర్శన్ అరెస్టుపై ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. దర్శన్ ఉన్న పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి తమ హీరోకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దర్శన్ ను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తాజాగా దర్శన్ అరెస్టుతో మనస్తాపం చెందిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.ఈ విషాద ఘటన చన్నపట్నంలో చోటుచేసుకుంది. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అభిమాని ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

రామనగర జిల్లా చన్నపట్నం తాలూకాలోని మాలెదొడ్డికి చెందిన భైరేష్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యాడని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట. గత 2-3 రోజులుగా అన్న పానీయాలు కూడా ముట్టుకోవడం లేదట. ఈ నేపథ్యంలో భైరేష్ మృతిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అతను కల్వర్టులో పడి ప్రాణాలు కోల్పోయాడని, ప్రమాదవశాత్తూ ఇది జరిగిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసులో అతనితో పాటు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దర్శన్‌ అరెస్ట్‌ అయి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతం ఆయనకు బెయిల్ రావడం అనుమానమే అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

 

దర్శన్ తో పవిత్ర గౌడ…

కాగా రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1గా ఉన్నారు. దర్శన్ ఏ2గా, కె.పవన్ ఏ3గా ఉన్నారు. రాఘవేంద్ర ఏ4, నందీష్ ఏ5, జగదీష్ అలియాస్ జగ్గా ఏ6, అను ఏ7, రవి ఏ8, రాజు ఏ9, వినయ్ ఏ10, నాగరాజ్ ఏ11, లక్ష్మణ్ ఏ12, దీపక్ ఏ13, ప్రదోష్ ఏ14, కార్తీక్ ఏ15, కేశవమూర్తి ఏ16, నిఖిల్ నాయక్ ఏ17గా నమోదయ్యారు. ప్రస్తుతం మొత్తం 13 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.