Major : విశేషంగా ఆకట్టుకుంటున్న మేజర్ మూవీ సెకండ్ సాంగ్.. లవ్లీ మోలోడీలో క్యూట్ గా అలరించిన శేష్,సాయి మంజ్రేకర్ జోడీ

వెర్సటైల్ స్టార్ అడివి శేష్(Adivi Sesh).. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ గా మరి పోయాడు ఈ యంగ్ హీరో. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ..

Major : విశేషంగా ఆకట్టుకుంటున్న మేజర్ మూవీ సెకండ్ సాంగ్.. లవ్లీ మోలోడీలో క్యూట్ గా అలరించిన శేష్,సాయి మంజ్రేకర్ జోడీ
Major
Follow us

|

Updated on: May 19, 2022 | 9:50 AM

వెర్సటైల్ స్టార్ అడివి శేష్(Adivi Sesh).. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ గా మరి పోయాడు ఈ యంగ్ హీరో. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ యంగ్ హీరో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్'( Major ). త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది.

ఒక గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారుల తమ లైఫ్ పార్ట్నర్స్ తో డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైయింది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వంఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90’లో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్ ని ఈ పాటలో అందంగా చూపించారు. సందీప్ కాలేజీ డేస్ లోని జ్ఞాపకాలని, లవ్లీ మూమెంట్స్ ని ప్లజంట్ గా చిత్రీకరించారు. ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ జోడి చాలా క్యూట్ గా అలరించింది. శేష్ అచ్చూ కాలేజీ స్టూడెంట్ లానే మేకోవర్ అవ్వడం నేచురల్ గా వుంది. ఈ పాటలో సాయి మంజ్రేకర్ తన ఫోన్ నెంబర్ ని ఒక్కొక్కటి గా ఇవ్వడం, ఇద్దరూ కెరీర్ ని డిసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీ.. ఇలా అందంగా లవ్లీ మాంటేజస్ లో చూపించడం ఆకట్టుకుంది. ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ అందించిన సాహిత్యం కూడా అంతే హాయిగా అనిపించింది. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద పాటని మరింత శ్రావ్యంగా ఆలపించారు. లవ్లీ మెలోడీగా వచ్చిన ఈ పాట ఇన్సెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Deepika Pilli: ట్రెండీ వేర్ లో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న దీపికా పిల్లి లేటెస్ట్ పిక్స్

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!