డెకాయిట్ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. అడవి శేష్, మృణాల్‌కు గాయాలు
అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ షూటింగ్స్ లో గాయపడ్డారు. ఇటీవలే కోలీవుడ్ లో ఓ స్టంట్ మాస్టర్ సినిమా షూటింగ్ లో మృతి చెందారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ హీరో అడవి శేష్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో, హీరోయిన్ కు గాయాలు అయ్యాయని తెలుస్తుంది. అడవి శేష్ హీరోగా డెకాయిట్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
షూటింగ్ లో ప్రమాదం జరిగి గాయాలైనప్పటికీ హీరో, హీరోయిన్ అది లెక్కచేయకుండా షూటింగ్ ను పూర్తి చేశారని తెలుస్తుంది. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అడవి శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మేజర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న శేష్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు. గూఢచారి 2తో పాటు డెకాయిట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. ఇప్పటికీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ముందుగా ఈ సినిమాలో శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆతర్వాత ఏమైందో ఏమో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు శేష్, మృణాల్ గాయపడ్డారని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




