టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోలకు కొదవేలేదు.. ఆ లిస్ట్ లో చాలా మంది హీరోలున్నారు వీరిలో అడవి శేష్ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అడివి శేష్. ఇప్పుడు మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు – హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభరితంగా తెరపై చూపించనున్నారు. మేజర్ జీవితంలోని వివిధ దశలను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యలు శేష్ మాట్లాడుతూ.. క్షణం సినిమా సమయంలో జరిగిన ఓ విషయాన్ని తెలిపారు.
అడవిశేష్ కెరీర్లో క్షణం సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్ నిర్మించింది. అయితే.. పీవీపీకి కథ వినిపించడానికి వెళ్లిన సమయంలో ఆయనతోపాటు మరి కొందరు ఉన్నారట. కథ విన్నతరవాత కొంతమంది చిన్న చిన్న మార్పులు చెప్పారట..అందులో ఒకరైతే అసలు ఈ కథ వర్కౌట్ కాదు అనేశారట. దాదాపు ఏడెనిమిది నెలలు కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఎందుకూ పనిరానట్టేనా?అని ఒక్కసారిగా శేష్ అందాలనకు గురయ్యారట. అక్కడే ఉన్న నిరంజన్ రెడ్డితో కలిసి పక్క గదిలోకి వెళ్లి వచ్చిన పీవీపీ సినిమా చేస్తున్నాం అని కన్ఫామ్ చేశారట. దాంతో తనకు ప్రాణం తిరిగొచినంతపనైందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చదవండి: